: ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్!


ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశం సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ లో కాపు సామాజిక వర్గం చాలా బలమైనదని అన్నారు. అయితే శాఖలుగా, వర్గాలుగా కాపులు ఉండటంతో వారిలో ఐక్యత లేదని అభిప్రాయపడ్డారు.

కాపులు ఏకమైతే పరిస్థితి వేరుగా ఉంటుందని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో 'జనసేన' ప్రభావం చూపే అవకాశం లేదని ఆయన చెప్పారు. పార్టీని నడపడం చిన్న విషయం కాదని ఆయన చెప్పారు. గతంలో వెలుగులోకి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. ఏపీలో బీజేపీ పాగావేయాలనే ప్రయత్నంలో ఉందని, అందుకే కాపులకు ప్రాధాన్యత పెంచే ప్రయత్నంలో ఉందని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News