: భావనతో నాకు ఎలాంటి సమస్య లేదు... నేనెందుకు కుట్రలో భాగమవుతాను?: సింగర్ రిమి ప్రశ్న


సినీ నటి భావనతో తనకు ఎలాంటి సమస్యలు లేవని, అలాంటప్పుడు ఆమెపై జరిగిన దాడి కుట్రలో తానెలా భాగస్వామినవుతానని టీవీ వ్యాఖ్యాత, సింగర్ రిమి టామీ ప్రశ్నించారు. నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో నేడు ఆమెను విచారించారు. దిలీప్ కు పల్సర్ సుని రాసిన లేఖలో 'మేడమ్' అని సంభోదించాడు. ఈ 'మేడమ్' ఎవరు అన్నది తెలుసుకునేందుకు రిమీని ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ‘ఈ కేసులో చెబుతున్న ఆ ‘మేడమ్‌’ నేను కాదు. బైజు పౌలోస్‌ అనే పోలీసు అధికారి నాకు ఫోన్‌ చేసి విదేశాల్లో నేను చేసిన స్టేజ్‌ షోల గురించి అడిగారు. ఈ కేసుతో నాకు సంబంధం లేదని పోలీసులకు తెలుసన్నారు. టీవీలో ప్రసారమైన తప్పుడు వార్తలు చాలా బాధించాయి. ఇలాంటి వార్తలు ప్రసారం చేసే ముందు ఒక్కసారి నన్ను సంప్రదించి ఆ తర్వాత ప్రసారం చేయండి. వేధింపులకు గురైన నటితో నాకు ఎటువంటి సమస్యలు లేవు’ అని ఆమె స్పష్టం చేశారు.

 కాగా, పలు మలుపులు తిరుగుతున్న ఈ కేసులో దిలీప్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతనికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం ఆయన భార్య కావ్య మాధవన్ ను విచారించిన పోలీసులు, రిమి టామీని కూడా ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News