: నా వెంట్రుకలు, గోళ్లు తీసుకోండి అని ముమైత్ అడిగినా వద్దన్న సిట్ అధికారులు


సిట్ విచారణ ఎదుర్కొన్న అనంతరం ముమైత్ ఖాన్ కు చిత్రమైన అనుభవం ఎదురైంది. సిట్ విచారణలో తొలి రెండు రోజులు నిందితుల నుంచి రక్త నమూనాతో పాటు, తల వెంట్రుకలు, చేతి, కాలి వేళ్ల గోళ్లను సేకరించిన సంగతి తెలిసిందే. అయితే నవదీప్ ను నమూనాలు కోరగా, నిరాకరించడంతో ఆయన నుంచి వాటిని సేకరించలేదు. అనంతరం హైకోర్టులో పోరాడి మరీ ఛార్మీ మినహాయింపు తెచ్చుకుంది. నేటి సిట్ విచారణలో తనకు డ్రగ్స్ అలవాటు లేదని స్పష్టం చేసింది. తాను రక్తంతో పాటు ఇతర నమూనాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమని తెలిపింది. అయినా ఆమె నుంచి నమూనాలు సేకరించేందుకు సిట్ అధికారులు నిరాకరించారని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News