: మల్లాది విష్ణుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి...చంద్రబాబుపై విమర్శలు చేసిన జగన్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో పేదల భూముల రికార్డులు మాయమై పెద్దల ప్రాజెక్టుల్లో దర్శనమిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత జగన్ విమర్శించారు. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పాలన ఎంతో చాలా దారుణంగా ఉందని అన్నారు. హీరోగా నటిస్తూ తీసిన గోదావరి పుష్కరాల సినిమాలో 31మంది మరణించడం చంద్రబాబు పాలనలోనే కనిపిస్తుందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ప్రత్యేకహోదాను పక్కనపెట్టడం చంద్రబాబు పాలనలోనే కనిపిస్తుందని అన్నారు. పొత్తు కోసం నదులపై ప్రాజెక్టులను పక్కనపెట్టడం చంద్రబాబు పాలనలోనే కనిపిస్తుందని ఆయన మండిపడ్డారు. హామీలు అమలు చేయమంటే కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనలో దుర్మార్గం కనిపిస్తోందని చెప్పారు. చీకటి రోజులు రాజ్యమేలుతున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలకు కనిపిస్తున్న రెండో దారి తమ పార్టీ అని అన్నారు. తమ పార్టీ మార్గంలో ప్రజలకు ఉచిత విద్యుత్, కుయ్ కుయ్ కుయ్ మంటూ వెళ్లే 108లు, ఉచిత విద్య పేరుతో ఫీజు రీ ఎంబర్స్ మెంట్, జిల్లాకో యూనివర్సిటీ, 32 లక్షల ఎకరాల భూముల పంపిణీ, ప్రతి గ్రామంలో కట్టిన ఇళ్లు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News