: విజయవాడ చేరుకున్న జగన్... కాసేపట్లో వైఎస్సార్సీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే
వైఎస్సార్సీపీ అధినేత జగన్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి జగన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్కడ విజయవాడ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జగన్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీలో చేరనున్నారు. విజయవాడలో కీలక నేతగా వ్యవహరించే మల్లాది విష్ణు వైఎస్సార్సీపీలో చేరడం పార్టీకి ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే వంగవీటి రాధా వైఎస్సార్సీపీలో ఉండగా, వంగవీటి వర్గానికి చెందిన వ్యక్తిగా పేరుపడ్డ మల్లాది విష్ణు ఆ పార్టీలో చేరడం ఆసక్తిరేపుతోంది.