: ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికపై మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఆంధ్రజ్యోతి పత్రిక అసత్య కథనాలు రాసిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు, ఆగస్టు 1వ తేదీన స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నట్లు సమాచారం.