: అబ్దుల్ కలాం పేరుకు కొత్త అర్థం చెప్పిన వెంకయ్యనాయుడు
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరుకు మాజీ బీజేపీ నేత వెంకయ్యనాయుడు సరికొత్త అర్థం చెప్పారు. అబ్దుల్ కలాం రెండో వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. `ఏపీజేఏకే` అంటే `ఏనీథింగ్ ఈజ్ పాజిబుల్ విత్ జస్ట్ ఆటిట్యూడ్ అండ్ కర్మ (సరైన దృక్పథం, కర్మ ఉంటే ఏదైనా సాధ్యమే!)` అని వివరించారు. సాధారణంగా ప్రధాని మోదీ ఇలాంటి పదాలు, వాటికి అర్థాలు సృష్టిస్తుంటారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు కూడా అదే కోవలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.