: పీవీ సింధుకి గ్రూప్-1 ఆఫీసర్‌గా అపాయింట్‌మెంట్... చంద్రబాబు ట్వీట్
2016 ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారు. పీవీ సింధుకు గ్రూప్-1 ఆఫీసర్‌గా అపాయింట్‌మెంట్ లెటర్ అందజేస్తున్న ఫొటోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. భవిష్యత్తులో దేశానికి సింధు మరింత ఖ్యాతిని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.