: శృతి హాసన్‌ ను విమర్శించడం బాధనిపించిందంటున్న భానుమతి ఉరఫ్ సాయిపల్లవి


ఫిదా సినిమాలో సాయి పల్లవి నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తడంతో ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శృతి హాసన్‌ ను విమర్శించడం తనను బాధించిందని తెలిపింది. మలయాళ ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి పోషించిన మలర్ పాత్రను తెలుగులో శృతి హాసన్‌ పోషించింది. సాయి పల్లవి స్థాయిలో శృతి హాసన్‌ నటించలేదని చాలా మంది విమర్శించారని ఆమె చెప్పింది. సినిమాలో శృతి హాసన్‌ నటనను చూడకముందే ఒక నిర్ణయానికి వచ్చి విమర్శించడం తనకు నచ్చలేదని తెలిపింది. సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలా మంది చాలా వాటికి తొందరపడిపోతున్నారని చెప్పింది. అది సరికాదని సూచించింది. తెలుగులో వచ్చిన ప్రేమమ్ విజయం సాధించిందని గుర్తుచేసింది. శృతి హాసన్‌ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయని తెలిపింది. కాగా, అప్పట్లో సాయిపల్లవితో శృతి హాసన్‌ ను పోలుస్తూ పలుపోలికలు తెచ్చారు. కొందరు ఔత్సాహికులు వారిద్దరికీ సంబంధించిన డాన్స్ వీడియోను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను చూడండి. 

  • Loading...

More Telugu News