: తరుణ్, నవదీప్ పబ్ లకు ఎన్నిసార్లు వెళ్లేవారు?: ముమైత్ ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన సిట్


టాలీవుడ్ ఐటెం బాంబ్ ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ తో పాప్యులర్ అయి, పలు పాత్రలు పోషించిన ముమైత్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాపై ఆమెనుంచి సిట్ అధికారులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సిట్ అధికారులు ముమైత్ కు సంధించిన ప్రశ్నల పరంపరలోకి వెళ్తే...మీరు డ్రగ్స్ తీసుకుంటారా? వారంతాల్లో ఎలా గడుపుతారు? పబ్ లకు తరచూ వెళ్తుంటారా? సినీ పరిశ్రమలోకి మీరు ఎలా ఎంటరయ్యారు? సినీ పరిశ్రమలోకి రాకముందు ఏం చేసేవారు? పబ్ లకు వెళ్తుంటారా? తరుణ్, నవదీప్ పబ్ లకు ఎన్నిసార్లు వెళ్లారు? పూరీ జగన్నాథ్ తో పోకిరి సినిమాతో క్లోజ్ అయ్యారా? అంతకు ముందునుంచే క్లోజ్ అయ్యారా? ముంబై నుంచి హైదరాబాదుకు కేవలం షూటింగ్స్ కోసమే వచ్చేవారా? ఎక్కువ ఐటెం సాంగ్స్ లో నటించే మీరు..చిత్ర యూనిట్ తో విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? డ్రగ్స్ తీసుకున్నారా? డ్రగ్స్ సరఫరా చేసేవారా? హైదరాబాదును విడిచి ముంబై ఎందుకు వెళ్లారు? నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్ లో మీరు ఏం చేసేవారు? ప్రతినెలా జరిగే గోవా ఫెస్టివల్స్ కు హాజరయ్యేందుకు కారణం ఏంటి? ఖాళీ సమయాల్లో మీరు ఎలా గడుపుతారు? కెల్విన్ తో పరిచయం ఎలా జరిగింది? కెల్విన్ కు మీరు క్లోజా? డ్రగ్స్ తీసుకున్నారా? తెలుగు సినీ పరిశ్రమలో ఎంత మంది డ్రగ్స్ తీసుకుంటారు? మీకు పూరీ, చార్మీ మాత్రమే కాకుండా ఎంత మందితో సన్నిహిత సంబంధాలున్నాయి? వంటి ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. 

  • Loading...

More Telugu News