: సరిగ్గా 600 పరుగులకు ఆలౌటైన టీమిండియా
గాలేలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 600 పరుగులకు ఆలౌటైంది. నిన్న మూడు వికెట్ల నష్టానికి 399 పరుగులతో ఆటను ముగించిన భారత జట్టు, నేడు మరో 201 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లనూ కోల్పోయింది. భారత జట్టులో ధావన్ 190, ముకుంద్ 12, పుజారా 153, కోహ్లీ 3, రహానే 57, అశ్విన్ 47, సాహా 16, పాండ్యా 50, జడేజా 15, షమీ 30 పరుగులు చేయగా, ఉమేష్ యాదవ్ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అశ్విన్ అవుటైన తరువాత వచ్చిన హార్డ్ హిట్టర్ పాండ్యా తనదైన శైలిలో ఆడుతూ లంక బౌలర్లపై విరుచుకు పడి 49 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 3 సిక్సులు, ఐదు ఫోర్లు కూడా కొట్టాడు. లంక బౌలర్లలో ప్రదీప్ కు 6, కుమారాకు 3, హెరాత్ కు 1 వికెట్ దక్కాయి. మరికాసేపట్లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.