: నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటన... పోలింగ్ ఆగస్టు 23న
ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 23న ఎన్నిక జరగనుండగా, అదే నెల 28న ఓట్ల లెక్కింపు, అదే రోజున ఫలితాల వెల్లడి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ నెల 29న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 5 వరకూ సమయం ఉంటుందని, 9వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తామని ఈసీ పేర్కొంది. తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా, వైకాపా నుంచి విజయం సాధించి, ఆపై తెలుగుదేశంలో చేరిన భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఈ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.