: నెటిజన్లను బకరా చేసిన కత్రినా కైఫ్... వీడియో చూడండి
ప్రస్తుతం `టైగర్ జిందా హై` చిత్రీకరణ నిమిత్తం మొరాకోలో ఉన్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. తాను పుషప్స్ చేస్తున్న వీడియో అది. మొదట అందరిలాగే రెండు చేతులు ఉపయోగించి పుషప్స్ చేసింది. తర్వాత ఒక చేతితో చేసి ఆశ్చర్యం కలిగించింది. చివరికి రెండు చేతులు ఉపయోగించకుండా పుషప్స్ చేసి నెటిజన్లను అబ్బుర పరిచింది. తీరా చూస్తే ఇదంతా ఒక ప్రాంక్ అని అర్థమై నెటిజన్లు నవ్వుకున్నారు. మరి తను చేసిన ప్రాంక్ ఏంటో మీరు కూడా చూడండి!