: కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ కన్నుమూత


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్, ఈ ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ధరమ్ సింగ్ కు భార్యా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించగా, 9 గంటల సమయంలో గుండెపోటు వచ్చిందని, ఆపై నిమిషాల్లోనే ఆయన మరణించారని వైద్య వర్గాలు తెలిపాయి. 2004 నుంచి మూడేళ్ల పాటు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు సంతాపాన్ని వెలిబుచ్చారు.

  • Loading...

More Telugu News