: త్వరలో మోదీ మంత్రివర్గంలో మార్పులు.... నితీశ్, శరద్ పవార్‌లకు స్థానం?
త్వరలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితీశ్ కుమార్ జనతా దళ్ (యునైటెడ్) వర్గానికి ఒక మంత్రి పదవి, ఒక సహాయ మంత్రి పదవి కేటాయిస్తారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అలాగే మోదీ కేబినెట్‌లో నితీశ్ కుమార్, శరద్ పవార్‌లకు స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీని గురించి బీజేపీ గానీ, జేడీయూ గానీ అధికారికంగా స్పష్టం చేయలేదు. వివాదాల కారణంగా 20 నెలలుగా కలిసి ఉన్న ఆర్జేడీ, జేడీయూ కూటమితో విడిపోయి నితీశ్ బీజేపీతో కలిశారు. 135 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బిహార్ ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం నితీశ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే.