: ముమైత్ ఖాన్ విచారణ ఏ భాషలో జరుగుతోందో తెలుసా?
డ్రగ్స్ వ్యవహారంలో నటి, ఐటెం గర్ల్ విచారణ సిట్ కార్యాలయంలో కొనసాగుతోంది. సిట్ కు చెందిన మహిళా అధికారులు ఆమెను విచారిస్తున్నారు. స్వతహాగా ముమైత్ ఖాన్ తెలుగు అమ్మాయి కాకపోవడంతో, ఏ భాషలో సమాధానాలు చెబుతారని అధికారులు ఆమెను అడిగారు. దానికి సమాధానంగా, హిందీ భాషలో చెబుతానని, మధ్యమధ్యలో ఇంగ్లీష్ లో చెబుతానని ఆమె తెలిపింది. కాసేపట్లో ఆమెకు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు. విచారణ పూర్తి కాగానే, బిగ్ బాస్ ప్రతినిధులతో కలసి ఆమె పూణేకు వెళ్లిపోనుంది.