: సిట్ ప్రశ్నలకు ముమైత్ ఖాన్ చెబుతున్న సమాధానాలివి!


దాదాపు రెండు గంటలకు పైగా ముమైత్ ఖాన్ ను సిట్ దర్యాఫ్తు బృందం విచారిస్తుండగా, వారు అడుగుతున్న ప్రశ్నలకు ఆమె ముక్తసరిగానే సమాధానాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. సిట్ వర్గాలందించిన సమాచారం ప్రకారం, ముమైత్ ను అడుగుతున్న ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఇవి...
ప్రశ్న: మీరు డ్రగ్స్ వాడతారా?
సమాధానం: లేదు... నేను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు.
ప్రశ్న: సినిమా వాళ్ల పార్టీల్లో డ్రగ్స్ చాలా కామన్ అట కదా?
సమాధానం: ఆ విషయం నాకు తెలియదు.
ప్రశ్న: మీరు పబ్స్ కు వెళతారా?
సమాధానం: వెళతాను.
ప్రశ్న: పబ్స్ కు ఎవరు డ్రగ్స్ సరఫరా చేస్తారు?
సమాధానం: నాకు తెలియదు. నేనసలు పబ్స్ లో డ్రగ్స్ చూడనేలేదు.
ప్రశ్న: మీరు డ్రగ్స్ వాడతారా?
సమాధానం: లేదు... నేను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు.
ప్రశ్న: పూరీకి, మీకు ఉన్న సంబంధాలు ఎటువంటివి?
సమాధానం: ఆయన నాకు గురువు లాంటివారు.
ప్రశ్న: కాల్విన్ తో మీకు పరిచయం ఎలా?
సమాధానం: అతను ఎవరో నాకు తెలియదు.
ఇటువంటి ప్రశ్నలను ముమైత్ ఖాన్ ఎదుర్కొంటోంది. కాగా, మరికాసేపట్లో ఆమెకు లంచ్ బ్రేక్ ఇచ్చి, ఆపై సాయంత్రం 5 గంటల వరకూ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. నిన్న కోర్టు ఇచ్చిన సూచనల మేరకు 5 గంటలలోపే విచారణ ముగిస్తామని సిట్ వర్గాలు స్పష్టం చేశాయి.

  • Loading...

More Telugu News