: త్వరలో అందుబాటులోకి ఫేస్‌బుక్ టీవీ?
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ త్వరలో టీవీ ప్రసారాలను కూడా ప్రారంభించనుంది. ప్రత్యేకంగా తమతో ఒప్పందం కుదుర్చుకున్న మీడియా సంస్థల కార్యక్రమాలను ఫేస్‌బుక్ టీవీ ద్వారా ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌లో ప్రారంభం కానున్న ఈ ఫేస్‌బుక్ టీవీలో మొదట తక్కువ నిడివి గల కార్యక్రమాలను ప్రసారం చేసి, భవిష్యత్తులో ఎక్కువ నిడివి గల సినిమాలు, టీవీ షోలు ప్రసారం చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ సంబంధిత మీడియా సంస్థలకు ఫేస్‌బుక్ టీవీ ద్వారా ప్రసారం చేయాలనుకున్న కార్యక్రమాలను సిద్ధం చేసుకోమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులకు నచ్చే విధంగా ఉండే కార్యక్రమాలను ప్రసారం చేయాలని ఫేస్‌బుక్ యోచిస్తోందని సమాచారం.