: ట్రంప్ రెండో త్రైమాసిక వేత‌నం... విద్యాశాఖ‌కు దానం


అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న రెండో త్రైమాసిక వేత‌నాన్ని అమెరికా విద్యాశాఖ‌కు దానం చేస్తున్న‌ట్లు వైట్‌హౌస్ అధికారిక మీడియా ప్ర‌క‌టించింది. అమెరిక‌న్ విద్యార్థుల‌కు ఉన్న‌త స్థాయి విద్య‌ను త‌క్కువ ఖ‌ర్చుతో అందించ‌డం కోసం ట్రంప్ త‌న వేత‌నాన్ని విద్యాశాఖ‌కు అంద‌జేస్తున్నార‌ని వైట్‌హౌస్ మీడియా సెక్ర‌ట‌రీ సారా శాండ‌ర్స్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె 1,00,000 డాల‌ర్ల చెక్కును విద్యాశాఖ ప్ర‌తినిధుల‌కు అంద‌జేశారు. అలాగే వైట్‌హౌస్‌లోని ఇత‌ర అధికారులు కూడా త‌మ వేత‌నాన్ని దానం చేయ‌డంతో మొత్తం 2,60,000 డాల‌ర్లు విద్యాశాఖ‌కు అందాయి. ట్రంప్ మొద‌టి త్రైమాసిక వేత‌నాన్ని అమెరికా నేష‌న‌ల్ బ్యాటిల్ ఫీల్డ్‌లోని రెండు ప్రాజెక్టుల పునః నిర్మాణానికి అంద‌జేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌న‌ను గెలిపిస్తే ఎలాంటి వేత‌నం తీసుకోకుండా ప‌నిచేస్తాన‌ని ట్రంప్ ప్ర‌క‌టించారు. కానీ అమెరికా చ‌ట్ట ప్ర‌కారం అధ్య‌క్షుడు వేత‌నం తీసుకొని తీరాలి. అందుకే అధికారికంగా వేత‌నం తీసుకుంటూ, తిరిగి ఆ వేత‌నాన్నే ఛారిటీ కోసం ట్రంప్ ఖ‌ర్చు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News