: రేప్ చేస్తామంటూ నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తికి బెదిరింపులు
ముస్లింలు చేసుకునే 'ఆజాన్' గురించి కామెంట్ చేసిన బాలీవుడ్ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తికి తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. ఆమెను లైంగికంగా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుచిత్ర పోలీసులను ఆశ్రయించింది. దీంతో, నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన బెదిరింపుల స్క్రీన్ షాట్లను తన ట్విట్టర్ లో సుచిత్ర పోస్ట్ చేసింది.
'ఈ వికృతమైన వ్యక్తులను చూడండి. నా దేశాన్ని చూస్తుంటేనే జాలి వేస్తోంది. మహిళల పట్ల ఇంత దారుణమైన దృక్పథం ఉన్నప్పుడు... ప్రపంచ రేప్ రాజధానిగా మన దేశం ఉండటంలో ఆశ్చర్యం లేదు' అంటూ వ్యాఖ్యానించింది. తెల్లవారుజామునే చెవులు చిల్లులు పడేలా ఆజాన్ పిలుపు ఇవ్వడాన్ని సుచిత్ర తప్పుబట్టిన సంగతి తెలిసిందే. దేవుడిని గుర్తు చేసేందుకు లౌడ్ స్పీకర్లను వాడాల్సిన అవసరం లేదని ఆమె కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే, ఆమెకు రేప్ బెదిరింపులు వచ్చాయి.