: మీకు, చార్మీకి పూరీ స్వయంగా డ్రగ్స్ ఇచ్చారా?: ముమైత్ ఖాన్ ను ప్రశ్నించిన సిట్


డ్రగ్స్ దందాలో 7వ రోజు విచారణలో భాగంగా నటి ముమైత్ ఖాన్ ను సిట్ ప్రశ్నిస్తోంది. సుమారు గంట నుంచి విచారణ జరుగుతూ ఉండగా, పూరీ డ్రగ్స్ వ్యవహారం, ఆయన పార్టీల్లో ముమైత్ పాల్గొనడం వంటి విషయాలపైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాల్విన్ తో ముమైత్ ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకున్నట్టు పెద్దగా ఆధారాలు లేకపోయినప్పటికీ, ఆయన మొబైల్ లో ముమైత్ సెల్ ఫోన్ నంబర్ కూడా ఉన్నట్టు సిట్ గుర్తించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముమైత్ కూడా డ్రగ్స్ వాడిందన్న అనుమానాలతో ఆమెను విచారణకు పిలవగా, నిన్న చార్మీని విచారించిన మహిళా అధికారులే నేడు ముమైత్ నూ విచారిస్తున్నారు. పూరీ, కాల్విన్ ల మధ్య ఫ్రెండ్ షిప్ ఎలాంటిది? ఆయనే స్వయంగా మీకు డ్రగ్స్ ఇచ్చారా? మీరు వాడుతారన్న విషయం వాస్తవం కాదా? మీతో పాటు చార్మీకి కూడా పూరీ జగన్నాథ్ నుంచి డ్రగ్స్ అందాయా? కాల్విన్ పార్టీలకు మీరు, పూరి కలసి వెళ్లేవారా? పార్టీలు ఎక్కడ జరుగుతుంటాయి? ఇంకా ఎవరెవరు హాజరయ్యేవారు? వంటి ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News