: ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన హిజ్రాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా హిజ్రాలు చేసిన నినాదాలతో అమెరికా మారుమోగింది. యూఎస్ మిలటరీలో పని చేయడానికి హిజ్రాలు పనికిరారంటూ వారిపై ట్రంప్ సర్కారు నిన్న నిషేధం విధించింది. వారి ఆరోగ్యం కోసం చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా తయారైందని ట్రంప్ సర్కారు తెలిపింది. ఈ నేపథ్యలో, ట్రంప్ నిర్ణయంపై హిజ్రాల నుంచి ప్రతిఘటన మొదలైంది.
ఈ అధ్యక్షుడు మాకు వద్దంటూ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఉన్న ఆర్మీ రిక్రూట్ మెంట్ సెంటర్ వద్ద హిజ్రాలు నినదించారు. కన్నీరు కారుస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీస్తామని హెచ్చరించారు. మరికొందరు హిజ్రాలు వైట్ హౌస్ వీధిలో మార్చ్ నిర్వహించారు. తమ శరీర భాగాల గురించి మీకెందుకని... ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమేనని వారు ప్లకార్డులు ప్రదర్శించారు.
మరోవైపు ట్రంప్ మాట్లాడుతూ, మిలిటరీలోని అత్యున్నత అధికారులను, నిపుణులను సంప్రదించిన తర్వాతే తాము ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు.