: తడబడ్డ టీమిండియా... రహానే కూడా అవుట్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజున నిలదొక్కుకున్న భారత ఆటగాళ్లు తడబడ్డారు. అద్భుత రీతిలో 153 పరుగులు చేసిన పుజారా అవుటైన తరువాత, కాసేపటికే హాఫ్ సెంచరీ చేసిన రహానే కూడా అవుట్ అయ్యాడు. కుమార వేసిన బంతికి రహానే షాట్ కొట్టగా కరుణరత్నే క్యాచ్ పట్టాడు. దీంతో 57 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసిన రహానే, 102 ఓవర్ తొలి బంతికి 432 పరుగుల వద్ద ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో భారత జట్టు 5 వికెట్లను కోల్పోయినట్లయింది. ప్రదీప్ కు నాలుగు వికెట్లు లభించడం విశేషం. ప్రస్తుతం భారత స్కోరు 103 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 436 పరుగులు కాగా, అశ్విన్, సాహా ఆడుతున్నారు.