: ఇలా జరుగుతుందని ముందే తెలుసు: రాహుల్ గాంధీ
బీహార్ లో నితీశ్ కుమార్ ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా మారతారని, ప్రజలు ఆమోదించని వైపు నడుస్తారన్న అనుమానాలు తనకు ముందు నుంచే ఉన్నాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, బీహార్ రాజకీయాలు మారిపోతాయని తనకు ముందు నుంచే అనుమానాలు ఉన్నాయని అన్నారు. అధికారం కోసం నేతలు ఎంతటి అడ్డదారినైనా తొక్కుతారని మరోసారి నిరూపితమైందని, నితీశ్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని అభిప్రాయపడ్డారు. గడచిన మూడు నాలుగు నెలల నుంచే ఈ కుట్ర జరుగుతూ వచ్చిందని రాహుల్ ఆరోపించారు.