: జూలై 31న `యుద్ధం శరణం` టీజర్
అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న `యుద్ధం శరణం` టీజర్‌ను జూలై 31న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నాగచైతన్య ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ట్వీట్ చేశాడు. ఇందులో శ్రీకాంత్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కొత్త దర్శకుడు కృష్ణ మరిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రేవతి, రావు రమేశ్‌లు కీలకపాత్రలు పోషించారు.