: పుజారా 150... ఆపై వికెట్ డౌన్... భారత స్కోరు 424/4


గాలేలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజున ఆదిలోనే భారత్ పుజారా వికెట్ ను కోల్పోయింది. 98వ ఓవర్ ను వేసిన ప్రదీప్, తన నాలుగో బంతికి పుజారాను పెవీలియన్ పంపాడు. ఓవర్ నైట్ స్కోరు 399/3తో ఈ ఉదయం ఆటను ప్రారంభించిన భారత్, మరో 24 పరుగులు జోడించి వికెట్ ను కోల్పోయింది. మొత్తం 265 బంతులను ఎదుర్కొన్న పుజారా 13 ఫోర్ల సాయంతో 153 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్న రహానే ప్రస్తుతం హాఫ్ సెంచరీని దాటాడు. 126 బంతులాడిన రహానే 3 ఫోర్ల సాయంతో 55 పరుగుల వద్ద ఉన్నాడు. అతనికి రవిచంద్రన్ అశ్విన్ వచ్చి జతకలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు 99 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 424 పరుగులు.

  • Loading...

More Telugu News