: సిట్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ ఖాన్


డ్రగ్స్ వ్యవహారంతో లింక్ ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్... విచారణ కోసం హైదరాబాదులోని సిట్ కార్యాలయానికి చేరుకుంది. బిగ్ బాస్ షోలో ఉన్న ఆమె... విచారణ కోసం పూణె నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు ఆమెను విచారించే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు నిన్న హీరోయిన్ ఛార్మిని కూడా సాయంత్రం 5 గంటల వరకే విచారించారు. ముమైత్ ను కూడా కేవలం మహిళా అధికారులే విచారించనున్నారు. ఈమె రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను కూడా అధికారులు సేకరించకపోవచ్చని తెలుస్తోంది. సిట్ కార్యాలయం వద్దకు ముమైత్ చేరుకున్న సమయంలో చాలా సందడి నెలకొంది. ఆమెను చూడ్డానికి ఎక్సైజ్ సిబ్బంది ఆసక్తిని ప్రదర్శించారు. ఎవరితో ఏమీ మాట్లాడకుండానే ఆమె విచారణ గదిలోకి వెళ్లిపోయారు. 

  • Loading...

More Telugu News