: మరో సంచలనం... డ్రగ్స్ ఉచ్చులో పోలీసు ఉన్నతాధికారుల పిల్లలు


నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన డ్రగ్స్ తిమింగలం మైక్ కమింగ, స్వయంగా పలువురు పోలీసు ఉన్నతాధికారుల పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. తాజాగా, పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన, మూడు రోజుల క్రితమే డ్రగ్స్ వాడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు తెలియగా, గుట్టుచప్పుడు కాకుండా వారంతా తమ పిల్లలను కౌన్సెలింగ్ కేంద్రాలకు పంపించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసు ఉన్నతాధికారులతో పాటు, మరికొందరు ప్రధాన అధికారుల పిల్లలకూ మైక్ డ్రగ్స్ అందించినట్టు గుర్తించిన సిట్ వారందరికీ సమాచారం ఇచ్చి, పిల్లలపై జాగ్రత్త పడాలని హెచ్చరించినట్టు తెలుస్తోంది. మొత్తం 20 మందికి పైగా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వారిని మైక్ లోబరచుకున్నాడని, ఆయన నోటి వెంట మరికొందరు సినీ ప్రముఖుల పేర్లూ వచ్చాయని సమాచారం.

  • Loading...

More Telugu News