: విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం చేసిన హాస్టల్ మేనేజర్!


హాస్టల్ లో ఉన్న అమ్మాయిలను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన హాస్టల్ మేనేజర్ కామాంధుడిగా మారి, ఓ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని కోట నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి కోట సిటీలోని ఇందిరావిహార్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ కాలేజీలో రెండేళ్లుగా ఇంటర్ చదువుతోంది. ఈ నేపథ్యంలో, హాస్టల్ మేనేజర్ గా ఉన్న ప్రదీప్ కుమార్ సుమన్ (30) అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాదు, తన కోరిక తీర్చకుంటే ఈ విషయాన్ని బయటపెడతానంటూ బెదిరిస్తూ, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు ఆమె ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, ప్రదీప్ పై ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు కామాంధుడిని రిమాండుకు తరలించింది. 

  • Loading...

More Telugu News