: బ్లూ కలర్ జాకెట్ కప్పుకుని, మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన ముమైత్ ఖాన్!


డ్రగ్స్ కేసులో ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ నేడు సిట్ విచారణను ఎదుర్కోబోతోంది. ఈ నేపథ్యంలో, బిగ్ బాష్ షో కోసం పూణెలో ఉన్న ఆమె... నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆమెకు నోటీసులు ఎలా పంపాలా అని తొలుత కాస్త ఇబ్బంది పడ్డ సిట్ అధికారులు... చివరకు ఫ్యాక్స్ ద్వారా ఆమెకు నోటీసులు పంపారు. దీంతో, విచారణ రోజున తాను తప్పకుండా హాజరవుతానని అధికారులకు ఆమె సమాచారం అందించింది. చెప్పిన ప్రకారంగానే ఆమె హైదరాబాద్ చేరుకుంది. నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆమె బయటకు వచ్చింది. మీడియా కంట పడకుండా ఉండేందుకు బ్లూ కలర్ జాకెట్ కప్పుకుని, వడివడిగా తన కారు వద్దకు ఆమె వెళ్లిపోయింది. ఈరోజు 10 గంటలకు ఆమె విచారణ ప్రారంభంకానుంది. 

  • Loading...

More Telugu News