: అమరావతిలో స్టార్ హోటళ్లకు 500 ఎకరాలు.. క్యూలో 8 స్టార్ హోటళ్లు!


నవ్యాంధ్ర రాజధానిని అద్భుతంగా నిర్మించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలకు భూములను కేటాయించిన ప్రభుత్వం... ఇప్పుడు స్టార్ హోటళ్ల నిర్మాణంపై దృష్టిని సారించింది. స్టార్ హోటళ్ల నిర్మాణానికి వీలుగా 500 ఎకరాలను సిద్ధంగా ఉంచాలని సీఆర్డీఏ అధికారులను ఆయన ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో వాటిని నిర్మించేలా భూములను రెడీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇస్తాంబుల్ తరహాలో అమరావతిలో ఆతిథ్యరంగాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. నోవాటెల్, తాజ్, రాడిసన్, జీఆర్టీ, పార్క్ తదితర ఎనిమిది ప్రముఖ సంస్థలు అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News