: గుజరాత్‌లో విషాదం.. వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి!
గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 110కి చేరుకుంది. మృతదేహాలు బురదలో కూరుకుపోయాయని పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏబీ పర్మర్ తెలిపారు. చనిపోయిన వారు బనస్కంత జిల్లాకు చెందిన ఒకే కుటుంబం వారని అధికారులు పేర్కొన్నారు. వరదల కారణంగా 36 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ హెలికాప్టర్ ద్వారా గుజరాత్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని అంచనా వేశారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోంలనూ వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బీహార్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వరదలు బీభీత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో ఇప్పటి వరకు 75 మంది మృతి చెందారు. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.