: ఆ నోటిఫికేషన్లను రద్దు చేయలేదు.. వదంతులు నమ్మొద్దు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్


గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయ్యాయంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) విజ్ఞప్తి చేసింది. గురుకుల పరీక్షలపై కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉందని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో పరీక్షలు వాయిదా వేశామే తప్పా, రద్దు చేయలేదని పేర్కొంది.

కాగా, బాలికలు, మహిళా విద్యా సంస్థల్లో పోస్టులన్నీ మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేయాలన్న జీవో నం 1274 ను హైకోర్టు నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయ, లెక్చర్ పోస్టులతో పాటు వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీ నిమిత్తం టీఎస్ పీఎస్సీ ఈ నెల 20న నిర్వహించాలనుకున్న రాత పరీక్షలన్నింటిని వాయిదా వేసింది.  

  • Loading...

More Telugu News