: నితీశ్ నిర్ణయాన్ని125 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారు: ప్రధాని మోదీ
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నబీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పదవికి రాజీనామా చేయకపోవడంపై తలెత్తిన విభేదాల నేపథ్యంలో కొంచెం సేపటి క్రితం సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నిమిత్తం ఆయన తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, నితీశ్ కు అభినందనలు తెలిపారు. నితీశ్ తీసుకున్న నిర్ణయాన్ని125 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారంటూ మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, నితీశ్ తన పదవికి రాజీనామా చేసిన కొన్ని నిమిషాలకే మోదీ తన ట్వీట్ చేయడం గమనార్హం.