: బీహార్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. సీఎం పదవికి నితీశ్ రాజీనామా!


బీహార్ లో రాజకీయ సంక్షోభం ముదిరింది. సీఎం నితీశ్ కుమార్ కొంచెం సేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. కాగా, అధికార పార్టీ జేడీయూ, ఆర్జేడీ మధ్య వివాదం కారణంగానే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామా చేసేందుకు నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీశ్, లాలూ మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో, వారి మధ్య వివాదం తలెత్తింది. కాగా, కొంచెం సేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. బీహార్ లో రాజకీయ పరిణామాలపై చర్చించనుంది.

  • Loading...

More Telugu News