: చంద్రబాబుదా? దేవుడిదా?... అమరావతికి టికెట్ విషయంలో తికమక పడుతున్న బస్ కండక్టర్లు!
వెలగపూడి ప్రాంతంలో సచివాలయం నిర్మించి దానికి అమరావతి అని పేరు పెట్టి, విపరీతంగా ప్రచారాలు చేయడం ఆ ప్రాంతంలోని బస్ కండక్టర్లను అయోమయానికి గురిచేస్తోంది. ప్రయాణికులు 'అమరావతికి టికెట్టివ్వండి' అనగానే ఏ అమరావతికి అడిగారో తెలియక తికమక పడుతున్నారు.
సచివాలయానికి అర్జీలు పెట్టుకోవడానికి వెళ్తున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం, వాళ్లంతా వెలగపూడి అనకుండా అమరావతికి అంటుండంతో ఆచితూచి టికెట్ ఇవ్వాల్సివస్తోంది. విజయవాడ నుంచి పంచారామాల్లో ఒకటైన `అమరావతి` వెళ్లే బస్సుల్లో ఇలాంటి సంఘటనలు కనీసం రోజుకు 10 వరకు జరుగుతున్నట్లు సమాచారం. కాబట్టి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రెండు అమరావతులు ఉన్నట్లు లెక్క. ఒకటి దేవుడు ఉన్న అమరావతి, ఇంకొకటి బాబు కట్టిన అమరావతి!