: మరోసారి పెద్ద నోట్ల రద్దు?
మరోసారి నోట్ల రద్దు కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం చేపట్టబోతోందనే సందేహాలు క్రమేణా బలపడుతున్నాయి. రూ. 2000 నోట్లను రద్దు చేసేందుకు సర్వం సిద్ధమైందని అంటున్నారు. ఇప్పటికే 2వేల నోట్ల ప్రింటింగ్ ను ఆర్బీఐ నిలిపివేసింది. ప్రస్తుతం రూ. 200 నోట్లను భారీగా ప్రింట్ చేస్తోంది. 2 వేల నోట్లు రద్దైనా... గతంలో మాదిరి ఈసారి కరెన్సీ సమస్యలు ఉండవని... 500 నోట్లు, 200 నోట్లతో ఎలాంటి సమస్యలు తలెత్తవని తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోట్లు ఎక్కువ భాగం బ్లాక్ మనీగాళ్ల వద్దకు చేరాయి.
మరోవైపు, ఈ విషయం పార్లమెంటు వరకు వెళ్లింది. రూ. 2000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించారా? అంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విపక్షాలు ప్రశ్నలు సంధించాయి. దీనిపై ఆయన కనీస క్లారిటీ కూడా ఇవ్వలేదు. దీంతో, మరో డీమానిటైజేషన్ కు కేంద్రం సిద్ధమవుతోందనే వార్తలకు మరింత ఊపు వచ్చింది.