: లోక్ సభ దృశ్యాలను చిత్రీకరించిన బీజేపీ ఎంపీ క్షమాపణలు
కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను మొబైల్ ఫోన్ లో చిత్రీకరించిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, ‘అనురాగ్, మీరు వీడియో తీసి ఉంటే వెంటనే క్షమాపణలు చెప్పండి’ అని ఆమె అనగానే, తాను చేసిన పనికి చింతిస్తున్నానంటూ సభకు అనురాగ్ క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించారు.
కాగా, రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై క్షమాపణలు చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ ఎంపీలు, స్పీకర్ సుమిత్రా మహాజన్ పై కాగితాలు విసరడం, ఆరుగురు ఎంపీలను ఐదు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయడం విదితమే. ఈ దృశ్యాలను అనురాగ్ ఠాకూర్ తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు.