: డ్రగ్స్ వ్యవహారంలో విదేశీయుడి అరెస్ట్.... దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా!
డ్రగ్స్ కేసులో భాగంగా మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ప్రకటించారు. నెదర్లాండ్ దేశానికి చెందిన 35 ఏళ్ల మైక్ కమింగాను నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అకున్ తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఆరు రోజుల పాటు ప్రయత్నించి మైక్ కమింగాను పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుణ్ని కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా మైక్ కమింగా డ్రగ్స్ సరఫరా చేసేవాడని, ఇప్పటికి నాలుగు సార్లు మైక్ ఇండియాకు వచ్చారని అకున్ వివరించారు. మైక్ కమింగాను విచారిస్తే కొత్త పేర్లు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.