: జార్ఖండ్ లో భారీ వర్షాలు.. 9 మంది మృతి


జార్ఖండ్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వర్షాల కారణంగా 9 మంది మృతి చెందగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. రాజధాని నగరం రాంచీ, రామ్ నగర్, ధన్ బాద్, హజారీబాగ్ తో పాటు ఇతర జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాంచీలో ఓ భారీ వృక్షం కూలి ఆటోపై పడిన సంఘటనలో ముగ్గురు, ధన్ బాద్, హజారీ బాగ్ జిల్లాల్లో నలుగురు, ఇతర ప్రాంతాల్లో మరో ఇద్దరు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టు జార్ఖండ్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది.

  • Loading...

More Telugu News