: ‘శాల్యూట్’ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్
కార్గిల్ యుద్ధంలో భారత్ గెలిచి నేటికి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా ఈ రోజున కార్గిల్ విజయ్ దివస్ ను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయతి. ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా, ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది.
‘ఆర్మీకి చెందిన ప్రతిఒక్కరితో పాటు అసువులు బాసిన వీరజవాన్లు అందరికీ శాల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే,దేశ ప్రజలు గుండెలపై చేయి వేసుకుని ధైర్యంగా జీవించడానికి కారణం వారే కాబట్టి’ అని రకుల్ తన దేశభక్తిని చాటుకుంది. కాగా, రకుల్ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తూ..‘యువార్ గ్రేట్ మామ్’, ‘లవ్ యు రకుల్ ప్రీత్’, ‘ఐయామ్ యాన్ ఆర్మీ కిడ్’, ‘నేను ఒప్పుకుంటాను’,‘ఆర్మీ గురించి ట్వీట్ చేసిన మీరు, గ్రేట్ రకుల్ జీ’ అని నెటిజన్లు ప్రశంసించారు.