: అలాంటి సినీ ప్రముఖులపై చర్యలు తప్పవు: తలసాని


సిట్ విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా సినీ పరిశ్రమలోని వారిపై చర్యలు తీసుకుంటామని టీఎస్ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. తమ వద్ద ఉన్న సాక్ష్యాల ఆధారంగా సినీ ప్రముఖులను సిట్ విచారిస్తోందని... విచారణ ముగిసిన అనంతరం సినీ పెద్దలతో సమావేశం అవుతామని చెప్పారు. డ్రగ్స్ నేపథ్యంలో సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయిందనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వాల వల్లే డ్రగ్స్ మహమ్మారి పిల్లల వరకు విస్తరించిందని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News