: రాష్ట్రపతిని ప్రత్యేకంగా కలిసిన మోదీ
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఈ రోజు ఉదయం రాష్ట్రపతి భవన్ లో కోవింద్ ను కలిసి శాలువాతో సన్మానించారు. ‘భారత్ కా సంవిధాన్’ పుస్తకాన్ని కోవింద్ కు మోదీ బహూకరించారు. అనంతరం, పలు అంశాలపై వారు చర్చించుకున్నారు. కాగా, ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను మోదీ పోస్ట్ చేశారు.