: డబుల్ సెంచరీ మిస్ అయిన ధావన్!


శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్ డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. 168 బంతుల్లో 190 పరుగులు చేసిన ధావన్ మరో షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. ప్రదీప్ బౌలింగ్ లో మిడ్ ఆఫ్ దిశగా ధావన్ ఆడిన బంతిని మాథ్యూస్ అవలీలగా అందుకున్నాడు. దీంతో, ధావన్ డబుల్ సెంచరీ చేస్తాడని ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు నిరాశ చెందారు. ఈ ఓవర్ పూర్తికాగానే అంపైర్ టీ బ్రేక్ ను ప్రకటించాడు. మరో ఎండ్ లో పుజారా 75 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పుజారాకు కోహ్లీ జతకలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 282 పరుగులు. 

  • Loading...

More Telugu News