: రేపు సిట్ ముందుకు ముమైత్ ఖాన్... 'స్వామీ ఓం' తరహాలో బిగ్ బాస్ పర్మిషన్


డ్రగ్స్ దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముమైత్ ఖాన్ రేపు సిట్ విచారణకు హాజరుకానుంది. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో ముమైత్ ఖాన్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. పలు చిన్నచిన్న విషయాలకు కంటతడిపెట్టుకుంటున్న ముమైత్ ఖాన్ సిట్ ముందు హాజరయ్యేందుకు బిగ్ బాస్ అనుమతిచ్చాడు. గతంలో హిందీ బిగ్ బాస్ సీజన్ 10 సందర్భంగా కంటెస్టెంట్ స్వామి ఓం కోర్టు కేసులో విచారణకు హాజరుకావాల్సి ఉండగా అప్పుడు కూడా అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

 రెండు రోజుల గ్యాప్ అనంతరం స్వామి ఓం మళ్లీ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు ముమైత్ ఖాన్ విషయంలో కూడా అదే రిపీటవుతోంది. దీంతో రేపు ఉదయం పది గంటలకు సిట్ ముందుకు ముమైత్ రానుంది. ఇప్పటికే డ్రగ్స్ విషయంలో పలు వివరాలు సేకరించిన సిట్ అధికారిణులు ముమైత్ ను అడిగేందుకు ప్రశ్నలపై ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఛార్మీ తరహాలోనే ముమైత్ ను కూడా మహిళా అధికారులు విచారించనున్నారు. 

  • Loading...

More Telugu News