: పార్టీలు ఎక్కడ? ఎవరితో వెళతారు? పూరీ ఇంటిపై బార్ అండ్ రెస్టారెంట్ వుందట, నిజమేనా?: చార్మీపై ప్రశ్నల వర్షం


మీరు పార్టీలు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎక్కడికి వెళతారు? ఎవరితో వెళతారు? పూరీ జగన్నాథ్ ఇంటిపై బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో రూములు ఉన్నాయా? ఆయన ఇంట్లోనే మత్తుమందులు తీసుకుంటారా? డ్రగ్స్ ఫెస్టివల్స్ జరుగుతాయన్న వార్తలు నిజమేనా? అవి ఎక్కడెక్కడ జరుగుతాయి? పంజాబ్ నుంచి మీ బంధువులు ఎవరైనా డ్రగ్స్ తీసుకువచ్చారా? వాటిని ఎవరికి ఇచ్చారు? సినిమా స్టోరీల డిస్కషన్ వేళ, పూరీ డ్రగ్స్ తీసుకుంటారా? ఆయన నుంచి మీకు డ్రగ్స్ వచ్చాయనడానికి మా వద్ద ఆధారాలు ఉన్నాయి... మీ సమాధానం? విదేశీ టూర్లకు వెళితే ఎక్కడ గడిపేవారు? ఏం చేసేవారు? వీకెండ్ లో పబ్బులకు వెళ్లే అలవాటు మీకు ఎక్కువేగా? సినిమా ఈవెంట్లు ముగిశాక, ఏ తరహా పార్టీలు ఉంటాయి? డ్రగ్స్ వాడకం చాలా కామన్ అట కదా? కెల్విన్ పరిచయం సుదీర్ఘంగా సాగడానికి కారణం ఏంటి?

చార్మీని విచారిస్తున్న వేళ, ఇలా సాగుతున్నాయి సిట్ అధికారుల ప్రశ్నలు, నిన్నటి వరకూ విచారించిన చిన్నా, సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు, పూరీ జగన్నాథ్ ఇచ్చిన సమాచారాన్ని చార్మీ సమాధానాలతో పోల్చుతూ అనుబంధ ప్రశ్నలను సంధిస్తుంటే, చార్మీ నీళ్లు నములుతూ, చాలా ప్రశ్నలకు సమాధానాలను దాటవేస్తున్నట్టు సిట్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News