: వన్డే తరహాలో సెంచరీ చేసిన శిఖర్ ధావన్... ఆకట్టుకుంటున్న టీమిండియా
టీమిండియ ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ సాధించాడు. శ్రీలంక జట్టుతో గాలెలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ధావన్ శుభారంభం ఇవ్వగా, అభినవ్ ముకుంద్ (12) విఫలమయ్యాడు. అనంతరం జతకలిసిన పుజారాతో కలిసి ధావన్ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. వన్డే తరహా ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలో ధావన్ లంచ్ ముగిసిన కాసేపటికి 111 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. పుజారా (44) అర్ధసెంచరీకి చేరువలో ఉన్నాడు. దీంతో 35. ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. టీమిండియా కోల్పోయిన వికెట్ ను ప్రదీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా నిలకడ ప్రదర్శిస్తున్న నేపథ్యంలో భారీ స్కోరు సాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.