: ధావన్ స్పీడ్ సెంచరీ... 150 పరుగులు దాటి దూసుకెళ్తున్న స్కోర్ బోర్డు


ఒక ఎండ్ లో ఛటేశ్వర్ పుజారా నుంచి చక్కటి సంయమనాన్ని అందుకుంటూ, శిఖర్ ధావన్ చెలరేగిపోవడంతో, భారత టీమ్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. శ్రీలంకలోని గాలేలో ఈ ఉదయం టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత జట్టులో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నంత వేగంగానే శిఖర్ ధావన్ సెంచరీని సాధించాడు. వన్డేను తలపించేలా ఆడుతూ, కేవలం 111 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. మరో ఎండ్ లోని పుజారా మాత్రం కాస్తంత నిదానంగా ఆడుతూ, 72 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి దగ్గరయ్యాడు. ప్రస్తుతం భారత స్కోరు 35 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 161 పరుగులు.

  • Loading...

More Telugu News