: విచారణలో చార్మీ ఇస్తున్న సమాధానాలపై బయటకు వచ్చిన లీకులివి!


ఈ ఉదయం 10 గంటల నుంచి హీరోయిన్ చార్మీని విచారిస్తున్న సిట్ అధికారులు సంధిస్తున్న ప్రశ్నల వర్షంపై సిట్ కార్యాలయం నుంచి లీక్ లు వస్తున్నాయి. వాటి వివరాలు ఎలా ఉన్నాయంటే..
ప్రశ్న: మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా?
సమాధానం: నేను డ్రగ్స్ తీసుకోను.
ప్రశ్న: మీరు పబ్ లకు వెళతారా?
సమాధానం: వెళ్తాను.
ప్రశ్న: పబ్స్ లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందా?
సమాధానం: ఆ విషయం నాకు తెలియదు.
ప్రశ్న: కాల్విన్ తో మీకు పరిచయం ఉందా?
సమాధానం: ఓ ఈవెంట్ లో పరిచయం అయ్యాడు.
ప్రశ్న: కాల్విన్ తో మీరు వెయ్యికి పైగా వాట్స్ యాప్ మెసేజ్ లను పంచుకున్నారు. దీనిపై మీరేమంటారు?
సమాధానం: (మౌనం)
ప్రశ్న: జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్ లో కాల్విన్ తో సెల్ఫీలు దిగారా?
సమాధానం: అందరితో దిగినట్టే, అతనితోనూ దిగాను.
ప్రశ్న: పూరీ జగన్నాథ్ మీకు స్నేహితుడేనా?
సమాధానం: అవును.
ప్రశ్న: పూరీ డ్రగ్స్ వాడతారా?
సమాధానం: వాడరు. ఆయన డ్రగ్స్ కు వ్యతిరేకి.
ప్రశ్న: మీకు ఇంటర్నేషనల్ సిమ్ ఉందా?
సమాధానం: లేదు.
ప్రశ్న: పూరీకి ఇంటర్నేషనల్ సిమ్ ఉందా?
సమాధానం: తెలియదు.
ప్రశ్న: పూరీ ఇంటర్నేషనల్ సిమ్ నుంచి మీకు ఫోన్ కాల్స్ వచ్చాయి కదా?
సమాధానం: (మౌనం)
ప్రశ్న: మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా?
సమాధానం: లేదు.
చార్మీ విచారణ కొనసాగుతోంది. మరో అరగంటలో సిట్ అధికారులు ఆమెకు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News