: మిలటరీ ఆఫీసర్‌గా మారడం కోసం అమెరికాకు బన్నీ!
తన తదుపరి చిత్రం `నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా` సినిమా కోసం మిలటరీ ఆఫీసర్‌గా మారడానికి నెలరోజుల పాటు అల్లు అర్జున్ అమెరికా వెళ్లనున్నారు. మిలటరీ ఆఫీసర్‌గా మంచి ఫిట్‌నెస్ సాధించి, ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయడానికి బన్నీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఈ గెటప్ కోసం నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. ఆయన వచ్చాకే చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
కథారచయితగా `కిక్`, `టెంపర్` వంటి హిట్ సినిమాలకు పనిచేసిన వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకునిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను ఎమాన్యుయేల్ నటించనుంది. విశాల్ - శేఖర్ ద్వయం స్వరాలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.